కలం, యాదాద్రి భువనగిరి: పోలీస్ స్టేషన్లకు వచ్చే పిటిషనర్లను ఎస్‌హెచ్‌వోలు తప్పనిసరిగా వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ (Yadadri Bhuvanagiri SP) అక్షాన్ష్ యాదవ్ (Akshansh Yadav) ఆదేశించారు. ప్రతి పిటిషన్‌పై తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. మంగళవారం భువనగిరిలోని డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన వివిధ నేరాలకు సంబంధించిన కేసులపై ఎస్పీ సమగ్రంగా సమీక్షించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. పోలీసులు గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, కేసుల సత్వర దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

