కలం, లైఫ్ స్టైల్: భర్త ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు, ఫోన్ ఎక్కువ సమయం వాడటం లాంటి విషయాలపై కొంతమంది భార్యలకు అనేక సందేహాలుంటాయి. ఈ విషయమై క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ జయా సుకుల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఫోన్ రహస్యంగా ఉంచడం, చాట్లు త్వరగా మూసివేయడం లాంటి చర్యలు అభద్రతా భావాన్ని పెంచుతున్నాయన్నారు. అయితే కేవలం అనుమానంతో కచ్చితమైన నిర్ణయానికి రావడం సరైనది కాదని స్పష్టం చేశారు.
ఫోన్ చెక్ చేయడం, నేరుగా మాట్లాడడం, సందేహించడం వల్ల రిలేషన్ (Relationships) దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనసులో చెడు ఆలోచనలతో నింపుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పార్ట్‌నర్‌పై ఆరోపణలు చేయడం సరైంది కాదంటున్నారు.
రహస్యంగా ఫోన్ చెక్ చేయడం వల్ల.. ఆ క్షణంలో ఆందోళన తగ్గినట్లు అనిపించినా, అది దంపతుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మరిన్ని సమస్యలకూ దారితీస్తుంది. కాబట్టి ఇరువైపులా అభద్రతా భావాలను తొలగించుకోవడానికి ఓపెన్‌గా మాట్లాడుకోవడమే ఆరోగ్యకరమైన బంధానికి ఏకైక మార్గమని నిపుణులు చెప్తున్నారు.

