ఐపీఎల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన కోహ్లీ.. వీడియో అదుర్స్ !

కలం, స్పోర్ట్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఐపీఎల్ 2026 సన్నాహాలను వేరే లెవెల్‌లో స్టార్ట్ చేశాడు. గతేడాది ఆర్‌సీబీ (RCB) ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ రన్ మెషీన్, ఇప్పుడు మళ్లీ టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఇండోర్ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. బుధవారం విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇండోర్ నెట్స్‌లో ఆయన భారీ షాట్లతో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోకు ‘IPL 2026’ అని క్యాప్షన్ ఇచ్చారు. గత సీజన్‌లో ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. 15 మ్యాచ్‌ల్లో 657 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా 43 పరుగులతో రాణించి జట్టు విజయంలో భాగమయ్యారు.

మరోవైపు, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను వరుసగా రెండోసారి నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. భారత్ గెలిచిన మూడవ టీ20 ప్రపంచకప్ ట్రోఫీ ఇది.

ఈ చారిత్రాత్మక విజయంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) స్పందిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు. భారత జట్టును ఛాంపియన్లుగా అభివర్ణించిన ఆయన, ఒత్తిడిలో ఆటగాళ్లు చూపిన పట్టుదల అమోఘమని కొనియాడారు. ఈ ప్రతిభావంతులైన జట్టుకు ఎవరూ సాటిరారని, యాజమాన్యం మరియు సహాయక సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. విరాట్ కోహ్లీ 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి ఐపీఎల్ 2026 పైనే ఉన్నట్లు కనిపిస్తోంది.

Read Also: తక్కువ ధరలో ఎలెక్ట్రిక్ కార్ కావాలా? అయితే కామెట్ EV పై ఓ లుక్కేయండి

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>