కలం, వెబ్ డెస్క్: కుంభమేళాలో పూసలు అమ్ముకొని ఫేమస్ అయిన మోనాలిసా (Monalisa) సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని మోనాలిసా కేరళలో లవ్ మ్యారేజ్ చేసుకుంది. సదరు అబ్బాయితో మోనాలిసాకు ఆరు నెలల క్రితమే పరిచయం అయ్యిందట. ఓ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నట్లు ఈ జంట తెలిపారు. ఇంత తక్కువ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, పెళ్లి అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే మోనాలిసా గతంలో తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మోనాలిసా (Monalisa) ఫేమస్ అయిన కొత్తలో యూట్యూబ్ ఛానళ్లకు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. ఆ టైంలో ఆమె పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. తనకు ఇంకా 16 ఏళ్లేనని(అప్పుడు), ఇప్పుడే పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమెకు కుంభమేళాలో ఉన్న క్రేజ్‌పై ప్రశ్నిస్తూ యూట్యూబర్లు నీ వెంట పడుతున్న వాళ్ల సంగతి ఏమిటని ప్రశ్నించారు. దానికి ఆమె వాళ్లంతా తను అన్నాదమ్ములలాంటి వాళ్లు అని చెప్పింది. తన తల్లిదండ్రులు ఎవర్ని చేసుకోమంటే వాళ్లనే పెళ్లి చేసుకుంటానని మోనాలిసా చెప్పింది. కానీ, ఇప్పుడు మాట మార్చి బాయ్‌ఫ్రెండ్‌ను చేసుకోవడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
తల్లిదండ్రులకు ఇచ్చిన మాట తప్పిందని, ఇంత త్వరగా పెళ్లి చేసుకొని కెరీర్‌కు ఎండ్‌కార్డ్ వేసుకుందని మోనాలిసాపై కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ జంట కేరళలో పెళ్లి చేసుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి మోనాలిసా పేరెంట్స్ ఒప్పుకోలేదని, వాళ్ల ఊరిలో వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు. కేరళలో తమకు చాలా మద్దతు లభించిందని, అందుకే ఇక్కడ పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు. కేరళ తమకు ఎంతో నచ్చిందని, భవిష్యత్తులో ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటామని చెప్పారు.
Read Also: ఎక్సైజ్ కానిస్టేబుల్‌ని నడిరోడ్డుపై హింసిస్తున్నభర్త
Follow Us On : WhatsApp

