Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యార్థినిపై డాన్స్ టీచర్ లైంగిక వేధింపులు

కలం, వరంగల్ బ్యూరో: విద్యార్థినిపై డాన్స్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన హన్మకొండ (Hanumakonda) జిల్లా ఖాజీపేట మండలంలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. ఓ స్కూల్లో డాన్స్ టీచర్‌గా పనిచేస్తున్న మైకేల్ కపిల్ కొంతకాలంగా ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు గురువారం స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పాఠశాలకు చేరుకుని డాన్స్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పాఠశాల యాజమాన్యం

డ్యాన్స్‌ క్లాస్‌లో సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలికల డాన్స్ ప్రాక్టీస్ సమయంలో కనీసం ఒక్క లేడీ టీచర్ కానీ వార్డెన్ పర్యవేక్షణ లేకుండా మేల్ డాన్స్ టీచర్‌కి పిల్లల్ని అప్పజెప్పడం సరికాదన్నారు. డాన్స్ టీచర్ తప్పు చేస్తే తమకేంటి సంబంధం అంటూ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భారీగా ఫీజులు చెల్లించి స్కూల్‌లో విద్యార్థిని చేర్పిస్తే ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా? అని మండిపడుతున్నారు.

Read Also: స్కూల్ బస్ ఆలస్యం.. ప్ర‌శ్నించిన‌ పేరెంట్స్‌పై దాడి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>