ఏపీ పోలీస్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కలం, వెబ్ డెస్క్ : పోలీస్ ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ (AP Police Recruitment) విడుదలైంది. ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 2,050 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఇందులో 378 ఎస్సై పోస్టులు, 1,156 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఎస్సై పోస్టుల్లో సివిల్‌ విభాగంలో 253, ఏఆర్‌లో 116, ఎస్పీఎఫ్‌లో 9 పోస్టులు ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్‌ విభాగంలో 50, పీటీవో విభాగంలో 10 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్‌ కీలకంగా మారింది. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ, ఫీజు, రాత పరీక్ష తదితర వివరాలను APSLPRB త్వరలో అధికారికంగా వెల్లడించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>