తెలంగాణ యువతకు ప్రధాని మోదీని కలిసే అవకాశం.. బండి సంజయ్ పిలుపు!

కలం, ​కరీంనగర్ బ్యూరో: ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Minister Bandi Sanjay) ఆవిష్కరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ (మైభారత్) కరీంనగర్ (Karimnagar) జిల్లా విభాగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర యువతీ యువకులు తమ ఆలోచనలతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, నేరుగా భారత ప్రధానిని కలిసే అరుదైన అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభిస్తుందని తెలిపారు. 15 నుండి 29 సంవత్సరాల వయస్సు కలిగిన యువత వెంటనే mybharat.gov.in పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా మన తెలంగాణ యువత సత్తా చాటాలని ఆకాంక్షించారు.

ఈ నమోదు ప్రక్రియకు సెప్టెంబర్ 30వ తేదీన చివరి గడువుగా నిర్ణయించారు. ​రాష్ట్రంలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు పూర్తి సహకారం అందించి, నమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి, కార్యక్రమ అధికారి జి. కిరణ్ కుమార్, మై భారత్ వాలంటీర్ బకారం అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>