కలం, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించారు. దీంతో ఆయన చేయబోయే సినిమాలు సౌత్ టూ నార్త్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న తాజా చిత్రం రాకా (Raaka). ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ఇటీవల మూవీ టీం బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది. కేవలం ఒక్క పోస్టర్‌తోనే సోషల్ మీడియాలో రాకా సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ సినిమాపై తమిళ హీరో ఆర్య (Arya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అట్లీ, అల్లు అర్జున్ కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ టీంను కలిశానని చెప్పుకొచ్చారు. రాకాలో (Raaka) మీరు కూడా పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… నేను సినిమాలో ఛాన్స్ అడిగాను కానీ, వాళ్లు ఇవ్వలేదు అని ఆర్య అన్నాడు. దీంతో అల్లు అర్జున్‌తో మల్టీ స్టారర్ మూవీస్‌లో కలిసి పని చేయాలని సౌత్ స్టార్లు ఆసక్తిగా ఉన్నారని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
Read Also: మానవత్వం చాటుకున్న సోనూసూద్.. చిన్నారికి పునర్జన్మ
Follow Us On: X(Twitter)

