కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan)కు బెదిరింపులు వచ్చాయి. కరుడుగట్టిన ఉగ్రవాదుల చేతిలో ఆయన త్వరలోనే హత్యకు గురవుతారని గుర్తుతెలియని వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు. కేంద్రమంత్రికి బెదిరింపు వచ్చిన వెంటనే, ఆయన కార్యాలయం కేంద్రహోం కార్యదర్శికి లేఖ రాసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిసింది.

