అంధ విద్యార్థులకు బోధన గొప్ప విషయం: భూపతి రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: అంధ విద్యార్థులను అక్కున చేర్చుకుని, బోధన అందించడం చాలా గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. నిజామాబాద్ నగరంలోని తారకరామనగర్‌లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్‌స్ట్రక్చన్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అంధుల ప్రత్యేక పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అంధుల ఆరాధ్య దైవం బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వంటగదితో పాటు విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఎలా ఇస్తున్నారో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

మామూలు విద్యార్థులతో సమానంగా..

అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. అంధ విద్యార్థులకు బోధించడం అతి కష్టమైందన్నారు. 1999 నుంచి వారి భవిష్యత్తు తీర్చిదిద్దే దిశగా స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి ఎస్.సిద్దయ్య, ఉపాధ్యాయ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారను. మామూలు విద్యార్థులతో సమానంగా అంధ విద్యార్థుల కూడా పదో తరగతి పరీక్షలు రాసేలా సహకరించాలని సిద్దయ్య కోరడం వారి పట్ల ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందన్నారు. కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్ వంటివి రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేస్తోందన్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు..

జిల్లా సంక్షేమ అధికారిణి సౌందర్య మాట్లాడుతూ.. స్నేహ సొసైటీ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. ఇదే పాఠశాలలో చదువుకున్న నాంపల్లి రజిని జిల్లా వైద్యారోగ్యశాఖలోని మలేరియా నియంత్రణ విభాగంలో పనిచేస్తూ.. తాను చదువుకున్న పాఠశాలలో తోటి విద్యార్థుల కోసం రూ.50 వేల విరాళం ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.

గౌరవ అతిథులుగా పాల్గొన్న విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయనంద రావు, దారం గంగాధర్ , డాక్టర్ సవిత రాణి, సెర్ల దయానంద్, తాటి సుధాకర్ పలువురిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కేశ వేణు, వయోజన విద్య ఉప సంచాలకులు పురుషోత్తం, 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రమేష్ , డిచ్ పల్లి ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, అమృతపూర్ గంగాధర్, మూత జనార్దన్, క్యాతం హనుమాండ్లు, గూడ శ్రీనివాస్ రెడ్డి, జలంధర్, కనకయ్య పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>