గాలికి ఎగిరిపడుతున్న పత్తి.. రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణంలోని పలు పత్తి మిల్లుల నుంచి పత్తిని తరలిస్తున్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పత్తిని పూర్తిస్థాయిలో కప్పకుండా రవాణా (Cotton Transport) చేస్తుండటంతో గాలికి ఎగిరిన పత్తి వెనుక వచ్చే వాహనదారుల కళ్లపై పడుతుందని, దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రహదారులపై పత్తి చెల్లాచెదురుగా పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ద్విచక్ర వాహనదారులు తెలిపారు. రవాణా సమయంలో భద్రతా నిబంధనలు పాటించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>