కలం, వెబ్ డెస్క్ : చైనాలోని షెన్జెన్ వేదికగా జరుగుతున్న 33వ ఏషియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు (APEC Summit)లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపై కలుసుకుని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు.
సదస్సులో భాగంగా 21 ఆసియా-పసిఫిక్ దేశాల అధినేతలతో కలిసి నిర్వహించిన ‘ఫ్యామిలీ ఫొటో’ సెషన్లో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ మధ్యలో నిలబడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫొటోకు ముందు ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించుకోవడం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
నేడు ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ త్రైపాక్షిక భేటీ
సదస్సు వేదికపై ఆత్మీయ పలకరింపుల అనంతరం గురువారం ఈ ముగ్గురు నేతలు చారిత్రాత్మక త్రైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ప్రపంచంలోని మూడు అగ్రరాజ్యాల అధినేతలు ఇలా ఒకే వేదికపై సమావేశం కావడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఈ కీలక సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, ఇరాన్ సంక్షోభ నివారణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాలు, కృత్రిమ మేధస్సు (AI) నియంత్రణ, అంతర్జాతీయ వాణిజ్య స్థిరత్వం వంటి కీలక అంశాలపై అగ్రనేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

