కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాగగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా,పాట్నా హైకోర్టు జడ్జి అనిల్ కుమార్ సింహ దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభు నరసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో భవాని శంకర్ స్వామివారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి, తదితరులు ఉన్నారు.

