Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్​‌కు ఫ్యాన్స్​‌పై ప్రేముంటే ఫ్రీగా టికెట్లు ఇవ్వాలి : ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : పవన్​ కళ్యాణ్​ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి (Anirudh Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా గెలిచిన తరువాత పవన్​ హైదరాబాద్​ లో ఎన్నిరోజులు, ఏపీలో ఎన్నిరోజులు ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. అమిత్​ షాపై ప్రేమ ఉంటే వెళ్లి గుజరాత్​ లో  పోటీ చేయాలని ఆయన సూచించారు. ఓజీ, ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమాలు ఫ్లాప్ అయిన ఫ్రస్టేషన్​ లో పవన్​ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చిరంజీవి అంటే తమకు అభిమానం ఉందని.. ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్​ లో విలీనం అయిన తరువాత పవన్​ కళ్యాణ్ (Pawan Kalyan)​ ఎక్కడికి వెళ్లిపోయారని అనిరుధ్​ రెడ్డి (Anirudh Reddy) ప్రశ్నించారు. పవన్​ కళ్యాణ్​ కు తన ఫ్యాన్స్ పై అంత ప్రేమ ఉంటే ఉచితంగా టికెట్లు పంచాలని సవాల్​ విసిరారు. రాజకీయాల్లోకి వచ్చాకే పవన్ బాగుపడ్డారన్నారు. ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే ప్రొడ్యూసర్ల దగ్గరకి పవన్​ వెళ్తాడని విమర్శించారు. ఏపీకి జగన్​ సీఎంగా ఉన్నప్పుడు పవన్​ హైదరాబాద్​ లో తలదాచుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

Read Also: మరో స్వాతంత్య్ర పోరాటంలా తెలంగాణ ఉద్యమం: కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>