కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ టెట్ (Telangana TET) పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు జూన్ 16 నుండి 22 వరకు జరగనున్న టీజీ టెట్ వివరణాత్మక షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. 10 సెషన్లలో జరిగే పరీక్షలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. రోజుకు రెండు షిఫ్టులు చొప్పున ఉదయం 9 నుండి 11.30 వరకు షిఫ్ట్ I, మధ్యాహ్నం 2 నుండి 4.30 వరకు షిఫ్ట్ II జరుగుతాయి. షెడ్యూల్ కు సంబంధించి పూర్తి వివరాలను ఉన్నత విద్యాశాఖ https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

