కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది. ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్‌నాథ్ (HCA President Amarnath) నియామకం చెల్లదంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో అంబుడ్స్‌మన్ ఆదేశాలతో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అమర్‌నాథ్, తక్షణమే తన పదవి నుంచి వైదొలగాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ వివాదానికి ముగింపు పలుకుతూ, నూతన అధ్యక్షుడి ఎన్నిక కోసం తదుపరి చర్యలు చేపట్టాలని కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. వెంటనే ఒక స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ (AGM) నిర్వహించి, ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని హెచ్‌సీఏ సెక్రెటరీ జీవన్ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో హెచ్‌సీఏలో మళ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది.
Read Also: ‘ఎల్లమ్మ’ దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుంది: థమన్
Follow Us On: X(Twitter)

