Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఎల్లమ్మ’ దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుంది: థమన్

కలం, సినిమా : రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు యేల్దండి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘ఎల్లమ్మ’(Yellamma) సినిమాపై సంగీత దర్శకుడు థమన్ (Thaman)  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కథ తనకు పూర్తిగా తెలుసని, దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నాడని చెప్పారు. నటుడిగా అతని కెరీర్‌కు ఈ చిత్రం కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుంది. ప్రేక్షకులు అతడిని కొత్త కోణంలో చూసే అవకాశం ఉంటుంది అని థమన్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘ఎల్లమ్మ’ చిత్రానికి  కొన్ని పాటలు చేయమని నన్ను అడిగారు. నేను కూడా చేస్తానని చెప్పాను. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సంతోషంగా ఉంది అని అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ‘ఎల్లమ్మ’పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. థమన్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ నటన, సినిమా కథ, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>