నేడు కేబినెట్ భేటీ.. సర్‌పై సీఎం రేవంత్ సమీక్ష

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం శుక్రవారం జరుగనుంది. సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth) అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతంపై సైతం చర్చించే అవకాశం కనిపిస్తోంది.

రైతులకు ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణపై మంత్రులు సమీక్షించనున్నారు. ఈ తరుణంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మీటింగ్ లో మూసీ పునరుజ్జీవ (Musi Rejuvenation) పథకం ఫేజ్-1 పనుల పురోగతిపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. అలాగే గోదావరి-బనకచర్ల వివాదంతో పాటు కృష్ణా, గోదావరి జలాల అంశాలపై చర్చ జరుగనుంది. రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక పరిపాలన, అభివృద్ధి అంశాలపై కూడా కేబినెట్ చర్చించే ఛాన్స్ ఉంది.

ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) పై కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీకానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు తప్పకుండ హాజరు అవ్వాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది.

Read Also: ఇస్రోకు ఊహించని షాక్.. అసలు కారణం ఇదేనా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>