టీడీపీకి ఎమ్మెల్యే కొలికపూడి షాక్.. మద్దతుకు నో!

కలం, వెబ్ డెస్క్: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరోసారి టీడీపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. తిరువూరు మున్సిపాలిటీ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించగా.. పసుపులేటి మాధవిని ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే ఆమెకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిన కొలికపూడి.. పెనుమల్లి శ్రావణిని మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. భారీ ర్యాలీ నిర్వహించి, శ్రావణితో నామినేషన్ వేయించారు. దీంతో రాజకీయ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. కొలికపూడిని కొంత మంది పార్టీ నేతలు సముదాయించే ప్రయత్నం చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం.

కఠిన చర్యలు తప్పవా..?

ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నో అంశాల్లో పార్టీ విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తున్న ఆయనపై పలుమార్లు సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని కూడా సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనేకసార్లు పిలిపించుకుని మరీ హెచ్చరికలు చేశారు. వాటిని ఏమాత్రం ఖాతరు చేయని కొలికపూడి.. తాజాగా సొంతంగా అభ్యర్థిని పోటీ చేయించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొలికపూడి(Kolikapudi Srinivasa Rao)పై ఇక కఠిన చర్యలు తప్పేలా లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Also Read : వచ్చేది మా ప్రభుత్వమే.. నేనే హోంమంత్రి : అంబటి కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>