వచ్చేది మా ప్రభుత్వమే.. నేనే హోంమంత్రి : అంబటి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : గుంటూరులో వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం రాజకీయ ఉత్కంఠకు వేదికైంది. నామినేషన్ దాఖలు చేసేందుకు విచ్చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అక్కడ విధుల్లో ఉన్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న సిబ్బందిలో చాలామంది మంచివాళ్లే అయినప్పటికీ, ఒక్క అధికారి మాత్రం సరిగ్గా వ్యవహరించడం లేదంటూ నేరుగా విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు (Ambati Rambabu) మాట్లాడుతూ.. రాబోయే రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన మొదటి ఆరు నెలల పాటు తనే స్వయంగా హోంమంత్రి పదవిని చేపడతానని స్పష్టం చేశారు. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ చూస్తారంటూ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సమక్షంలోనే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఏపీలో నారాసుర రక్తచరిత్ర : వైఎస్ జగన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>