సీఎం విజయ్ ఆఫర్ వద్దన్న ఉదయనిధి స్టాలిన్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో ప్రతి ఎమ్మెల్యేకు కారు, ఇతర సౌకర్యాలు కల్పించబోతున్నట్లు సీఎం విజయ్ (CM Vijay) ప్రకటించిన నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టారు. డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు విజయ్ ఆఫర్ తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరగ్గా.. ఉదయనిధి ఈ మేరకు ప్రకటించారు. ప్రజా ధనాన్ని ఎమ్మెల్యేల విలాసవంతమైన జీవనానికి వాడుకోవద్దని హితవు పలికారు.

‘టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రచారం చేస్తోంది. మరి ఇప్పుడు రూ.కోట్లు వెచ్చించి కార్లు కొనుగోలు చేయడం అవసరమా..? ముఖ్యమంత్రి ఆఫర్ మాకొద్దు. అలాగే ప్రతి ఎమ్మెల్యే అఫిడవిట్ చెక్ చేశాకే.. నిజంగా కారు సౌకర్యం లేని వారికే వాటిని అందించాలి. కారు లేకపోయినా కొనగలిగే స్థోమత ఉన్నవారికి ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని ఉదయనిధి స్పష్టం చేశారు.

విజయ్ ఏం ప్రకటించారంటే..

టీవీకే ప్రభుత్వంలో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలున్నారని, కనీసం కారు కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం విజయ్‌కు వివరించారు. దీంతో, ప్రతి ఎమ్మెల్యేకు కారుతో పాటు ఖర్చుల కింద ప్రతి నెలా రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజలకు సేవ చేసే క్రమంలో వివిధ ప్రాంతాలకు ఎమ్మెల్యేలు వెళ్లాల్సి ఉంటుందని, కారు లేని కారణంగా ఇబ్బందులు పడొద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ తెలిపారు. అయితే, దీన్ని డీఎంకే తప్పుపడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>