సూర్యాపేట జిల్లాలో ఘోరం.. జంట హత్యల కలకలం!

కలం, సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మోతె (Mothey) మండల కేంద్రం సమీపంలో తీవ్ర కలకలం రేగింది. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారికి సమీపంలోని వ్యవసాయ భూముల్లో దంపతులు దారుణంగా హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు దంపతులను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆధారాలు లభించకుండా మృతదేహాలను పొలాల్లో పాతిపెట్టడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతులను మోతె (Mothey) మండలం బీక్యా తండాకు చెందిన హలావత్ బూబా, ఆయన భార్య నాగులుగా గుర్తించారు. వీరు గత ఐదేళ్లుగా మోతె మండల కేంద్రంలోనే నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రారంభంలో ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, దేహాలను పాతిపెట్టిన తీరును బట్టి దుండగులు ప్రణాళికాబద్ధంగా హత్య చేసి ఆధారాలు లభించకుండా పూడ్చిపెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఆధారాల సేకరణ అనంతరం, తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్లాన్ వెనుక ఎవరున్నారు? పాత కక్షలేమైనా ఉన్నాయా? లేక ఆర్థిక, వ్యక్తిగత వివాదాలు ఏమైనా దారితీశాయా? అనే పలు కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Also Read : జూ. ఎన్టీఆర్ ఆరోగ్యంపై డాక్టర్ల కీలక ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>