కలం, వెబ్ డెస్క్: 18 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా (Supreme Court) నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చిన్న పిల్లలకు కేవలం తల్లిదండ్రులు, సంరక్షకుల సమక్షంలోనే సోషల్ మీడియా ఉపయోగించేలా చర్యలు ఆదేశాలు ఇవ్వాలని ఎన్టీవో సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్స్ సుప్రీం కోర్టులో పిల్ వేసింది.
ఫేస్ బుక్, స్నాప్ చాట్ వంటి సోషల్ ప్లాట్‌ఫారాలు 13 ఏళ్ల నుంచే పిల్లలకు అకౌంట్లు క్రియేట్ చేసుకునే అవకాశం ఇస్తున్నాయని అందులో పేర్కొంది. భారత చట్టాల ప్రకారం, 18 ఏళ్ల దాటని వారినే మైనర్లుగా పరిగణిస్తుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో మరింత స్పష్టత అవసరమని కోరింది.
చట్ట సవరణ చేస్తేనే..
18 ఏళ్ల లోపు వారు సోషల్ మీడియా వాడే విషయంలో కచ్చితమైన నిబంధనలు పొందుపరిచేలా కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టును కోరింది. ఐటీ చట్టంలో సవరణలు తీసుకురావడంతో పాటు డిజిటల్ మీడియా రూల్స్–2021లో కొత్త మార్గదర్శకాలు చేర్చాలని విన్నవించింది. తల్లిదండ్రులు, సంరక్షకుల కేవైసీ ఉంటేనే పిల్లలు సోషల్ మీడియా వాడుకునేలా చేయాలని తెలిపింది. ఆన్ లైన్ గేమింగ్, లైంగిక వేధింపులు, వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత సైబర్ నేరాల నుంచి పిల్లలను కాపాడేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయని అభిప్రాయపడింది.

