కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) లోని జెన్‌కో ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఎస్‌పీఎఫ్ ఆధ్వర్యంలో ఫైర్ మాక్ డ్రిల్ (Fire Mock Drill) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ 99లో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌పీఎఫ్ అధికారులు ప్రతాప్ నాయుడు, శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డీఐజీ మాధవరావు ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు.
జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఈ డ్రిల్ నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ జెన్‌కో ఫైర్ విభాగం అధికారులు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ (Fire Mock Drill) నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రమాదాలను ఎలా నియంత్రించాలి అనే అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్, ఎస్‌ఈ రఘురాం, డీఈ ప్రసన్న కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఆమెకు లైక్ కొట్టిన కోహ్లీ.. అంతా షాక్!
Follow Us On: Instagram

