కలం, వెబ్ డెస్క్: మణిపూర్ (Manipur)లో మిలిటెంట్లు మరోసారి రక్తపాతం సృష్టించారు. విచక్షణరహితంగా కాల్పులు జరిపి నలుగురిని పొట్టన పెట్టుకున్నారు. తమెలాంగ్ జిల్లాలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో భార్యాభర్తలు సహా నలుగురు మరణించారు. ఈ ఘటనలో ఆరేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కుకీ తెగ సెప్టెంబర్ 13వ తేదీని ‘బ్లాక్ డే’ గా పాటిస్తుంటుంది.
1990లో కుకీ–నాగా జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించినవారికి సంతాపంగా ఈ రోజును ‘బ్లాక్ డే’ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మిలిటెంట్లు దాడులకు తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

