కలం, కరీంనగర్ బ్యూరో : మొలంగూర్ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో అగ్ని గుండాలు, స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో గల కాకతీయుల, నిజాం కాలం నాటి నుంచి కోరిన కోరికలు తీర్చి భక్తుల ఇళ్లలో కొంగు బంగారం వెలిచే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతియేట సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర స్వామి ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు, అగ్ని గుండాలు, శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆశ భక్తజనం నడుమ నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నలుమూలల నుండి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన భక్తులు హాజరై మొక్కులను చెల్లించుకుంటారు.

Read Also: డజను అంశాలతో ఎజెండా ఫిక్స్.. మూడు శాఖలపై క్యాబినెట్ చర్చ
Follow Us On: Pinterest


