కలం/ఖమ్మం బ్యూరో: హోలీ పండుగ వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raj) సిబ్బందితో కలిసి స్టెప్పులేశారు. కొత్తగూడెంలోని హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ “బాయిలోనీ బల్లి పడితే” పాటకు డ్యాన్స్ వేశారు. దీంతో పాటు పలు హిందీ పాటలకు కూడా స్టెప్పులేసి సిబ్బందిని ఉత్సాహ పరిచారు.
నిత్యం ప్రజా రక్షణలో బిజీగా ఉండే పోలీసులు, సరదాగా రంగులు పూసుకోవడం, డ్యాన్స్‌లు కూడా వేయడంతో స్థానికంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పొచ్చు. అయితే కొత్తగూడెం ఎస్పీ గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో డ్యాన్స్ చేయడం గమనార్హం.
Read Also: ఇరాన్ బాలికల మృతిపై కేటీఆర్ ఎమోషనల్
Follow Us On: X(Twitter)

