నిర్మల్ ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి

కలం, నిర్మల్: నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించి, ట్రాఫిక్ సమస్యలకు (Traffic Issues) పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) తెలిపారు. సోమవారం ట్రైనీ డీఎస్పీలతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. బస్టాండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు, ఆటోల నిలుపుదల, రోడ్లపై దుకాణాల నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించారు.

రహదారులపై ఆక్రమణలు లేకుండా చూడాలని, వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లో క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో బస్టాండ్, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో ట్రైనీ డీఎస్పీలు గజారే సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, పట్టణ సీఐ సమ్మయ్య, ఎస్ఐ సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>