బాసరలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల

కలం, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో (Basara Saraswati Temple) మూల నక్షత్రం సందర్భంగా నిర్వహిస్తున్న మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈమేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ వారికి సహకరించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొని, తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవాలని సూచించారు. అంతకుముందు ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>