తెలంగాణ విద్యుత్తు డిమాండ్‌లో సరికొత్త రికార్డు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో విద్యుత్తు (Telangana Power) డిమాండ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 15న ఉదయం 10.29 గంటలకు 20,003 మెగావాట్లకు చేరుకుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్‌ కావడం గమనార్హం. గతేడాది 18,548 మెగావాట్లు నమోదు కాగా.. ఇప్పుడు 1,455 మెగావాట్లు అధికం కావడంతో విద్యుత్తు అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. అక్టోబర్ 15న ఒక్క రోజే 334.54 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరగడం కూడా మరో రికార్డు. రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సీఎండీ కోరారు. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

ఆ నాలుగు ప్రధాన కారణాలు..

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకు పెరగడానికి ప్రధానంగా నాలుగు కారణాలను అధికారులు చెబుతున్నారు. ఇళ్లు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, వ్యవసాయ రంగాలు అధిక విద్యుత్తు డిమాండ్ కోరుతున్నాయని పేర్కొన్నారు. ఎల్ నినో కారణంగా ప్రాజెక్టుల్లోకి నీరు రాకపోవడంపై హైడల్ పవర్ ప్రొడక్షన్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. బొగ్గు నాణ్యత, ప్లాంట్లల్లో రకరకాల సమస్యలతో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలు, ఓపెన్ గ్రిడ్ నుంచి అధిక ధరలకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు విద్యుత్తు శాఖ వర్గాలు తెలిపాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>