ఎన్నికల టికెట్ కోసం పెళ్లి.. టీడీపీ నేతకు షాక్!

కలం, వెబ్ డెస్క్ : సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో, ఆ టికెట్ సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేత హర్షవర్ధన్ తన ప్రేయసి మంజీరను హడావుడిగా వివాహం (Salur Marriage) చేసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి ముహూర్తాలు చూడకుండా, బంధువులను కూడా పిలవకుండా గుడిలో హడావుడిగా తాళి కట్టేశాడు.

భార్యకు ఛైర్‌పర్సన్ టికెట్ తెచ్చుకోవచ్చనే ప్లాన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కూటమి సీట్ల సర్దుబాటులో సాలూరు ఛైర్‌పర్సన్ స్థానం జనసేన పార్టీకి కేటాయించడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>