మార్చి 11న కొత్త గవర్నర్ బాధ్యతల స్వీకరణ

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గవర్న‌ర్‌గా శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఎల్లుండి (మార్చి 11న) బాధ్యతలు చేపట్టనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయన చేత లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో శివప్రతాప్ శుక్లా వస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా 2023 నుంచి పని చేస్తున్న శుక్లా తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదు రోజులకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించనున్నారు.

ఇప్పటి వరకూ గవర్నర్‌గా వ్యవహరించిన జిష్ణుదేవ్ వర్మ ఆదివారం (మార్చి 8) సాయంత్రమే రిలీవ్ అయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు. కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్చి 16న అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Read Also: వెలుగుమట్ల బాధితులకు కవిత భరోసా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>