సచిన్ వల్లే నా ఆట మారింది: సంజూ శాంసన్

కలం, వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2026 హీరో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజూ శాంసన్ (Sanju Samson) తన అద్భుత ప్రదర్శన వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. కెరీర్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనకు అండగా నిలిచారని..  ఆయనకు సంజూ కృతజ్ఞతలు తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ విజయం తర్వాత మాట్లాడిన సంజూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కొన్ని నెలలుగా తాను సచిన్ టెండూల్కర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నానని.. సచిన్ అందించిన మార్గదర్శకం వల్లే తాను ఈ స్థాయికి చేరానని సంజూ తెలిపాడు.

గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో తన కలలు చెదిరిపోయాయని సంజూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్లిష్ట సమయంలో సచిన్ (Sachin Tendulkar) స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారని తెలిపాడు.  2024 వరల్డ్ కప్ జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాలేదని, కానీ అప్పటి నుంచే తాను ఇలాంటి ప్రదర్శన కోసం కష్టపడుతున్నానని తెలిపాడు. దేవుడు తన కోసం గొప్ప ప్రణాళికలు రచించారని, అందుకే కీలక సమయాల్లో రాణించగలిగానని సంజూ (Sanju Samson) పేర్కొన్నాడు .

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>