రాంచందర్ రావు వ్యాఖ్యలకు జనసేన ఘాటు కౌంటర్!

కలం, వెబ్ డెస్క్​ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన (Janasena) తెలంగాణ నాయకుడు శంకర్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. పొత్తుల గురించి మాట్లాడే లేదా నిర్ణయాలు తీసుకునే అధికారం రాంచందర్ రావుకు లేదని ఆయన స్పష్టం చేశారు.

రెండు పార్టీల పొత్తుకు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునేది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కేంద్ర అధిష్టానం మాత్రమేనని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో స్థానిక నాయకులు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పొత్తు వద్దనుకుంటే జనసేన పార్టీ వెనకడుగు వేయదని శంకర్ గౌడ్ తెలిపారు. అవసరమైతే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉన్పట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>