చిత్తూరులో సీమంతం చేసుకున్న సమంత!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) సీమంతం వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా గ్యాప్ త‌ర్వాత మా ఇంటి బంగారం సినిమాతో స‌మంత రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూల స‌మ‌యంలోనే స‌మంత ప్రెగ్నెంట్ అంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే మొద‌ట్లో స‌మంత దీనిపై స్పందించ‌లేదు. మూవీ విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకున్న త‌ర్వాత స‌మంత ఓ ప్రెస్‌మీట్ ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తాన‌ని, త‌న‌కు మెట‌ర్న‌టి లీవ్ కావాల‌ని చెప్పింది. దీంతో అక్క‌డున్న వారంతా కంగ్రాట్స్ చెప్పారు.

ఇలా త‌న ప్రెగ్నెన్సీని సింపుల్‌గా రివీల్ చేసిన సామ్ ఇప్పుడు అంతే సింపుల్‌గా సీమంతం వేడుక‌లు కూడా చేసుకుంది. ఇటీవ‌ల స‌మంత త‌న భ‌ర్త రాజ్ నిడిమోరుతో థాయ్‌లాండ్ ట్రిప్‌కి వెళ్లింది. ఆ త‌ర్వాత చిత్తూరులోని త‌న భ‌ర్త ఇంటికి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా రాజ్ కుటుంబ‌స‌భ్యులు స‌మంత‌కు సీమంతం చేశారు. ఈ ఫోటోల‌ను రాజ్ సోద‌రి శీత‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో ఇవి కాస్తా వైర‌ల్‌గా మారాయి. స‌మంత‌కు రాజ్ నిడిమోరుతో డిసెంబ‌ర్‌లో వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>