epaper
Friday, January 16, 2026
spot_img
epaper

30 ఏళ్ల నాటి కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి జైలు.. ఎందుకంటే?

కలం, వెబ్​డెస్క్​: ‘తప్పు చేసినవాళ్లు ఏనాటికైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అనే విషయం మరోసారి నిజమైంది.  అందుకే 85 ఏళ్ల వయసులో ఆ వృద్ధుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..  సురేశ్​ చంద్ర రాథ్​ (85) ఒడిశాలోని పూరీ డివిజనల్​ ఫారెస్ట్ ఆఫీస్​లో అసిస్టెంట్​ కన్జర్వేటివ్​ ఆఫ్​ ఫారెస్ట్స్​(ఏసీఎఫ్​)గా పనిచేసి రిటైరయ్యారు (Retired Forest Officer). ఈయన 1969లో ఫారెస్ట్​ ఆఫీసర్​గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1999లో రిటైరయ్యారు. అయితే, సురేశ్​ చంద్రపై 30 ఏళ్ల కిందట.. అంటే 1996లో అక్రమాస్తుల కేసు ​ నమోదైంది. విజిలెన్స్​ తనిఖీల్లో అతని వద్ద రూ.11లక్షలకుపైనే పట్టుబడింది. అప్పట్లో ఇది భారీ మొత్తం. ఆ కేసు దర్యాప్తు అలా కొనసాగుతూ వచ్చింది.

విజిలెన్స్​ అధికారులు పట్టువదలని విక్రమార్కుల్లా సాక్షాధారాలు సేకరించారు. ఈ క్రమంలో సురేశ్​ చంద్ర (Suresh Chandra Rath) పదవీ విరమణ (Retired Forest Officer) కూడా పూర్తయ్యింది. చివరికి అన్ని ఆధారాలను భువనేశ్వర్​లోని స్పెషల్​ విజిలెన్స్​ కోర్టుకు  అధికారులు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి  హిమాన్షు శేఖర్​ మల్లిక్​ శుక్రవారం తీర్పు వెల్లడించారు. సురేశ్​ చంద్ర రాథ్​కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు. ఆ విధంగా  అక్రమాస్తుల కేసులో ముప్పై ఏళ్ల తర్వాత శిక్ష పడింది.‘ కృష్ణా , రామా’ అనుకుంటూ కాలం గడపాల్సిన వయస్సులో శిక్ష పడడం అవినీతి పరులకు, అక్రమార్కులకు ఓ హెచ్చరిక లాంటిదే.

Read Also: బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ యాప్‌లపై కేంద్రం ఉక్కుపాదం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>