కలం, వెబ్ డెస్క్ : రామంతాపూర్ (Ramanthapur) చర్చ్ కాలనీలో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రాంతంలోని ఓ స్క్రాప్ షాపులో లోహాన్ని కట్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో స్క్రాప్ డీలర్ పరశురామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్థానికులు బాధితుడిని అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన శరీరంలో సుమారు 70 శాతం కాలినట్లు వైద్యులు వెల్లడించగా, పరశురామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోహం కట్ చేస్తుండగా పేలుడు సంభవించడానికి గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read : దేశాన్ని కాపాడుకుందాం: రాహుల్ గాంధీ సంచలన పిలుపు
Follow Us On: Youtube

