పట్టెడ అవల్‌ క్షేత్రంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ ప్రత్యేక పూజలు

కలం, ఖానాపూర్‌ : మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో ఉన్న పట్టెడ అవల్‌ దేవస్థానాన్ని ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ (Vedma Bojju) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ, వ్యవసాయ సవాళ్లను ప్రజలు ధైర్యంగా ఎదుర్కొనేలా ఆశీస్సులు అందించాలని, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలిచే శక్తిని ప్రసాదించాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను ఘనంగా సన్మానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>