కలం, కరీంనగర్: అయోధ్య–కాశీ విశ్వేశ్వర యాత్ర చేసేందుకు రెండు బస్సులను మేయర్ తో కలిసి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్లోని గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45 ఆర్యవైశ్య వృద్ధ జంటలకు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 45 వృద్ధ వైశ్య జంటలను ఉచితంగా అయోధ్య–కాశీ పుణ్యక్షేత్రాల యాత్రకు తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు.
వృద్ధులకు ఆధ్యాత్మిక యాత్రను అందుబాటులోకి తీసుకువచ్చి, వారి పుణ్యక్షేత్రాల సందర్శన ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని పొన్నం పేర్కొన్నారు. ఇలాంటి సేవా, పుణ్య కార్యక్రమాన్ని చేపట్టిన గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకుడు గంప శ్రీనివాస్ ను ఎమ్మెల్యే (MLA Kavvampally) అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read : దేశాన్ని కాపాడుకుందాం: రాహుల్ గాంధీ సంచలన పిలుపు
Follow Us On : WhatsApp

