కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల వేదిక అయిన టీజీ ఐపాస్ (TG iPASS) పోర్టల్ సైబర్ దాడికి గురైంది. హ్యాకర్లు ఈ పోర్టల్ డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడంతో పాటు, ఫైళ్ల పేర్లను .vgb ఎక్స్‌టెన్షన్‌తో మార్చేశారు. సర్వర్‌లో రాన్సమ్ నోట్‌ను గుర్తించిన అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. అక్టోబర్ 22 రాత్రి నుంచి పోర్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రభుత్వానికి అందాల్సిన వ్యాపార అనుమతులు, పారిశ్రామిక సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటనపై ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ TGCSBకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టంలోని సెక్షన్లు 43, 66 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీ బృందాలు ఈ సర్వర్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు సిద్ధం చేశాయి. ముఖ్యంగా హ్యాకర్లు డేటాను చోరీ చేసి బయటకు తరలించారా లేదా అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Also Read : ‘మన్ కీ బాత్’లో ‘కొమురం భీమ్’ స్మరణ గర్వకారణం: కలెక్టర్ రాజర్షి షా
Follow Us On: Youtube

