Mobile Popup Ad
Mobile Popup Ad

వీగిన మ‌హిళా బిల్లు.. కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల‌కు ప్రియాంక ఘాటు రిప్లై!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌తిప‌క్షాల తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన మూడు బిల్లులు లోక్‌స‌భ‌లో వీగిపోయాయి. కేంద్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా బిల్లు (Women Reservation Bill) వీగిపోవ‌డంతో బీజేపీ స‌భ్యులు కాంగ్రెస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పార్ల‌మెంట్ బ‌య‌ట కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. మ‌హిళా బిల్లుకు బ్రేక్ ప‌డ‌టంతో కాంగ్రెస్ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం డీలిమిటేష‌న్‌తో మ‌హిళా బిల్లును ముడిపెట్ట‌డాన్ని ఎప్ప‌టికీ అంగీక‌రించేది లేద‌న్నారు. ఈ బిల్లు ఆమోదం పొంద‌డం అసాధ్య‌మ‌న్నారు. మహిళా బిల్లు వీగిపోవడానికి కేంద్ర‌ ప్రభుత్వమే కారణ‌మ‌ని చెప్పారు. కాంగ్రెస్‌ది మ‌హిళా విరోధి మైండ్‌సెట్‌ అంటున్న బీజేపీ విమ‌ర్శ‌ల‌పై ప్రియాంకా తీవ్ర స్థాయిలో స్పందించారు. మ‌హిళ‌ల‌పై మా మైండ్ సెట్‌ను ప్ర‌శ్నించే ముందు హ‌థ్రాస్‌లో, ఉన్నావ్‌లో, మ‌ణిపూర్‌లో మ‌హిళ‌ల కోసం ఏం చేశారో ఆలోచించుకోవాల‌న్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>