కుదేలైన‌ కేకేఆర్.. గుజరాత్ టార్గెట్ ఇదే!

క‌లం, వెబ్ డెస్క్‌: గుజరాత్ దెబ్బకు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ కుదేలయింది. కేకేఆర్‌ (KKR)ను కామెరన్ గ్రీన్ ఆదుకోవడం ఒక రకంగా పర్వాలేదు అన్న స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అజింక్యా రహానే (0), అంగ్‌క్రిష్ రఘువంశీ (8), టిమ్ సీఫెర్ట్ (19) వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ కేకేఆర్‌ను ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (79) తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ఒకానొక దశలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును రోవ్‌మన్ పావెల్ (27)తో కలిసి గ్రీన్ గట్టెక్కించాడు. అయితే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. గుజరాత్ బౌలర్లలో రబడా 3 వికెట్లతో చెలరేగగా, సిరాజ్, అశోక్ శర్మ రెండేసి వికెట్లు తీసి కేకేఆర్ నడ్డి విరిచారు. గుజరాత్ విజయం సాధించాలంటే 181 పరుగులు చేయాల్సి ఉంది.

గుజరాత్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి కేకేఆర్‌ను కట్టడి చేశారు. కాగిసో రబడా 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. యువ బౌలర్ అశోక్ శర్మ 45 పరుగులిచ్చినప్పటికీ 2 వికెట్లు సాధించాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 44 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, ప్రసిద్ధ్ కృష్ణకు కూడా ఒక వికెట్ దక్కింది. గుజరాత్ ఫీల్డింగ్‌లో జోస్ బట్లర్ 4 క్యాచ్‌లు, ఒక రనౌట్‌తో మెరిశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>