కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2)ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు దీపిక పదుకొణె ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ మూవీ సీక్వెల్ లో దీపికా ప్లేస్ ను సొట్టబుగ్గల సుందరి ఆలియా భట్ రీప్లేస్ చేయనుందనే ప్రచారం జరుగుతుంది.
దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ కానీ, నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రభాస్ చేసిన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆల్ఫా’ సినిమా జూలై 3న రిలీజ్ కానుండగా.. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేకాదు ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నది’’ అంటూ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ సో మచ్ ప్రభాస్” అంటూ ఆ స్టోరీని ఆలియా రీ షేర్ చేసింది. ఇలా ఇద్దరి మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణతో.. ‘కల్కి 2’లో ఆలియా కన్ఫామ్ అంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. అంతేకాదు సాధారణంగా ప్రభాస్ హిందీ సినిమాల ప్రమోషన్స్ కి బూస్టప్ ఇవ్వడం చాలా రేర్ అని, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ లో ఆలియా నటిస్తుంది గనుకే ప్రభాస్ ప్రమోట్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. కాగా, రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలియా భట్.. ఇప్పుడు ప్రభాస్‌తో కూడా కలిసి నటిస్తే ఆ రేంజ్ వేరప్పా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.

