నిందితుడి సమాచారం ఇస్తే భారీ రివార్డ్.. సీపీ ప్రకటన

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) మండలం దైవాలగూడలో ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుమార్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి సమాచారం తెలిపినవారికి రూ.2 లక్షల రివార్డ్ అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రకటించారు.

నిందితుడు ఉన్న లోకేషన్, అతడు వెళ్లిన దారి చెప్పినా.. లేకపోతే నేరుగా అప్పగించినవారికి ఈ పారితోషికం ఇస్తామని వివరించారు. సమాచారం నిజమని తేలిన వెంటనే రూ.2 లక్షల చెక్ అందిస్తామని.. అత్యంత ఘోరంగా హత్యలు చేసిన వ్యక్తిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీస్ శాఖ ప్రజల సాయం కోరుతోందని సీపీ తెలిపారు.

చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కంట్రోల్ రూం..

హత్యలకు సంబంధించిన విషయమై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సీపీ తరుణ్ జోషి ప్రకటించారు. నిందితుడి సంబంధించి ఎవరైనా సమాచారం అందించాలనుకుంటే 8712665324 నెంబరుకి నేరుగా కాల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. అలా చెప్పినవారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, వారి గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>