సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ (Pawan Kalyan) భేటీ అయ్యారు. కాన్వాయ్ లేకుండా కారులో ఒంటరిగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. 100 మున్సిపాలిటీల్లో తాత్కాలికంగా ఎన్నికల ప్రక్రియ నిలిపివేత, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో జనసేన, టీడీపీ సీట్ల కేటాయింపుల్లో కేడర్ అసంతృప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ అంశాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఈ అంశంపై ప్రధాన చర్చ..?

100 మున్సిపాలిటీల్లో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన ఎన్నికల సంఘం సాయంత్రం లోగా వీటిపై మరింత స్పష్టమైన ప్రకటన చేయబోతుంది. కొద్ది రోజులు ఆగాక నిర్వహించాలా.. లేకపోతే పూర్తిగా వాయిదా వేయాలా.. అనేది తేల్చనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రకటించే నిర్ణయం ఆధారంగా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Chandrababu – Pawan Kalyan)​ ప్రధానంగా చర్చించి ఉంటారని పార్టీల్లో చర్చ జరుగుతోంది.

Also Read : యనమల రామకృష్ణుడుకు తీవ్ర అస్వస్థత

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>