కలం, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కాకినాడలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ సానా సతీష్‌బాబు ఆసుపత్రికి వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

