పండుగ సాయన్నను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి: అదనపు కలెక్టర్

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బహుజన సంక్షేమ పోరాట వీరుడు పండుగ సాయన్న జయంతి (Panduga Sayanna Jayanti) వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇంచార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్(Additional Collector Rathod Ramesh) , ముదిరాజ్ సంఘ నాయకులతో కలిసి పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజనుల అణిచివేతపై ఆనాటి కాలంలో దొరలు, భూస్వాములు, నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పండుగ సాయన్న గొప్ప పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయనను మనమంతా స్పూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తొలిసారిగా పండుగ సాయన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.

ఇలాంటి మహనీయుల జీవిత విశేషాలు నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలిపారు. పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ముదిరాజ్ సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జయంతి వేడుకలలో బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఉపాధి కల్పన శాఖ అధికారి విజయలక్ష్మి, కార్మిక శాఖ అధికారి రాజలింగం, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ముదిరాజ్ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>