అమ్మవారి నిమజ్జనానికి ఏర్పాట్లు ఎక్కడ? నల్లచెరువు వద్ద హిందూ వాహిని ఫైర్!

కలం, వనపర్తి: దేవీ నవరాత్రి ఉత్సవాల అనంతరం అమ్మవారి విగ్రహాల నిమజ్జనం కోసం నల్లచెరువు వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై హిందూ వాహిని (Hindu Vahini) వనపర్తి (Wanaparthy) శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హిందూ వాహిని జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్ ఆరోపించారు.

వనపర్తి పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన అనంతరం అమ్మవారి విగ్రహాల నిమజ్జనం కోసం నల్లచెరువుకు చేరుకోగా, అక్కడ తగిన ఏర్పాట్లు కనిపించలేదని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డును పక్కకు తొలగించి, ఉత్సవాలు ముగిసిన తర్వాత తిరిగి యథాస్థానంలో ఉంచుతున్నారని విమర్శించారు.

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ విషయం దాటవేశారని అరుణ్ గౌడ్ ఆరోపించారు. దీంతో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించిన నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. పండుగల సందర్భంగా ముందస్తు ప్రణాళికతో అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. నిమజ్జన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని హిందూ వాహిని వనపర్తి శాఖ తరఫున అరుణ్ గౌడ్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>