జీతాలు చెల్లించండి.. నిర్మల్‌లో ఔట్‌సోర్సింగ్ కార్మికుల ఆందోళన

కలం, నిర్మల్: పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఔట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. తమకు రావాల్సిన రెండు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించేంత వరకు విధులకు హాజరుకాబోమని, మున్సిపల్‌ అధికారులు స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Also Read : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. విపక్షాలకు అస్త్రంగా ‘రిమాండ్ రిజెక్షన్లు’!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>