తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు (Rains Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి. అలాగే, రంగారెడ్డి జిల్లా ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. అనంతరం నల్లగొండ జిల్లా ఘట్‌పాల్, మునుగోడు, చండూరు, నల్గొండ పట్టణం, కంగల్, నాంపల్లి ప్రాంతాలకు వానలు విస్తరించబోతున్నాయి.

పలు జిల్లాల్లో మోస్తరుగా..

నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఉరుములతో వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>